హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలీల నుంచి డ్రైవర్ల వరకు అప్రమత్తత అవసరం

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకుంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెల్లవారుజామున కూలి పనులకు వెళ్లేవారు, వాహనదారులు, డ్రైవర్లు జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలను నెమ్మదిగా నడపాలని తెలిపారు. నిర్లక్ష్యంగా ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.