హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వకర్మ మహాసభ అధ్యక్షుడిగా సత్యనారాయణ

MNCL: విశ్వకర్మ మహాసభ జైపూర్ మండల అధ్యక్షునిగా కొక్కొండ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు సోమవారం విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులు, కులస్తుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సత్యనారాయణను అందరూ అభినందించారు.