హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమార్తెతో కలిసి భార్య అదృశ్యం.. పోలీసులకు భర్త ఫిర్యాదు

ASF: వాంకిడి మండలం బంబారకు చెందిన సారిక, ఆమె కుమార్తె వేదశ్రీ ఈ నెల 14 నుంచి అదృశ్యమయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురితో కలిసి భార్య వెళ్లిపోయిందని భర్త బావునే శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. బంధువుల ఇళ్లలో, గ్రామంలో గాలించినా ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI మహేందర్ వెల్లడించారు.