హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో క్షుద్రపూజల కలకలం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేపుతుంది. రహదారులు, కూడళ్ల వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లతో పూజల ఆనవాళ్లు, నాటుకోడి బలి ఇచ్చిన గుర్తులు భయభ్రంతులకు గురి చేస్తున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు నిఘా పెంచి, పెట్రోలింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.