హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

MBNR: నవాబుపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఈసూరి శ్రీకాంత్ (20) అదృశ్యమయ్యాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఈనెల 11న పని ఉందని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నరేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.