హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నేతల అరెస్టు

MHBD: తొర్రూరు పట్టణంలోని దుబ్బ తండా సమీపంలో నేడు లబ్ధిదారులకు 280 డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని వారు హెచ్చరించారు.