హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో నీటి కొరత లేదు: మంత్రి

HYD: నగరంలో తాగునీటి కొరత లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వచ్చే వర్షాకాలం వరకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. రాబోయే వేసవిలోనూ నగర ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అనంతరం నీటి కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నగర ప్రజలకు భరోసా ఇచ్చారు.