MBNR: కురుమూర్తి ఉద్దాలను చిన్నవడ్డేమాన్ గ్రామానికి చెందిన 60 దళిత కుటుంబాలు తయారు చేస్తారు. కార్తీక అమావాస్య నుంచి ఏడురోజులపాటు మద్య, మాంసాలకు దూరంగా ఉంటూ, ఒంటిపూట భోజనం చేస్తూ నియమ నిష్ఠలతో పాదుకలను తయారు చేస్తారు. ఆవు చర్మం, వన్నెలాకు, పచ్చపూసలు, టేన్పోగులు, తగ్గి, వైనం, రేషం, పట్టు తదితర వస్తువులతో కురుమూర్తిస్వామి, పద్మావతి అమ్మవార్ల పాదుకలను రూపొందిస్తారు.
తెలంగాణ
నియమ నిష్టలతో ఉద్దాల తయారీ


