హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడు

నిజామాబాద్‌ వన్ టౌన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. వన్‌టౌన్ SHO శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. కోజాకాలనీకి చెందిన ముజాత్ ఖాన్ (40) భార్య ఫర్హానా బేగం వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇందుకు భర్త అడ్డువస్తున్నాడని, ఆమె ప్రియుడు మన్సూర్‌‌తో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.