హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి ఉద్దాల రూట్ ఇదే..!

MBNR: కురుమూర్తి ఉద్దాల ఉత్సవంలో భాగంగా పల్లమరి గ్రామం నుంచి చాటను ట్రాక్టర్‌పై ఊరేగింపుగా వడ్డేమాన్‌ గ్రామంలోని ఉద్దాల మండపానికి తీసుకొస్తారు. అక్కడ స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాటలో ఉంచుతారు. అనంతరం అప్పంపల్లి ఊకచెట్టువాగు నుంచి వ్యవసాయ పొలాల మీదుగా తిర్మలాపూర్‌ గ్రామానికి.. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై కురుమూర్తి గుట్టకు చేరుకుంటుంది.