RR: శంకర్‌పల్లి చందిప్ప గ్రామంలోని 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో కార్తీకమాస సందర్భంగా భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. ఉదయం అభిషేకాల అనంతరం దర్శనాలు కల్పించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. చైర్మన్ కుమార్ యాదవ్, కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
మరకత శివాలయానికి పోటెత్తిన భక్తజనం


