హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కలెక్టరేట్‌‌‌లో పిల్లల ప్రత్యేక ప్రజావాణి

WNP: జిల్లా బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం పిల్లల ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సాధారణ ప్రజావాణి ప్రాంగణంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయనున్నారు. విద్య, ఆరోగ్యం, పోషణ, రక్షణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల లబ్ధి తదితర సమస్యలను పిల్లలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు.