హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజ్ చేసిన ద్విచక్ర వాహనాల రేపు వేలం

MHBD: గూడూరులో నాటుసారా, గుడుంబా కేసుల్లో పట్టుబడిన 17 ద్విచక్ర వాహనాలకు రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ మమత తెలిపారు. జిల్లా ఎక్సైజ్ అధికారి కరంచంద్ ఆధ్వర్యంలో ఈ వేలం జరుగుతుందన్నారు. వేలంపాటలో పాల్గొనేవారు తమ ఆధార్ కార్డు జిరాక్స్‌ కాపీతో నిర్ణీత సమయంలోగా ఎక్సైజ్ స్టేషన్‌కు హాజరుకావాలని సూచించారు.