హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప ఆలయ అధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్

JGL: కోరుట్ల అయ్యప్ప దేవాలయంలో వ్యవస్థాపక గౌరవాధ్యక్షులు చిదురాల నారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. 2024-2026 ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఆమోదించారు. అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా అంబటి శ్రీనివాస్ గురుస్వామిని మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సభ్యులుగా సీనియర్ గురుస్వాములు మంచాల సుధాకర్, రాజలింగంలు ఎన్నికయ్యారు.