హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు

HNK: శాయంపేట మండలం ప్రగతిసింగారం గ్రామానికి చెందిన బల్ల శ్రీనివాస్ ఆదివారం తన వ్యవసాయ పొలంలో పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా క్రషర్ సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ సామర్ల నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు.