BHPL: భూపాలపల్లి మండలం కొత్తపల్లి (ఎస్ఎం) గ్రామంలో ఆదివారం విద్యుదాఘాతంతో లింగంపల్లి రామారావుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. గ్రామ శివారులోని పొలాల్లో లూజుగా ఉన్న విద్యుత్ వైరు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆవు విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని, బాధిత రైతుకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
తెలంగాణ
కరెంట్ షాక్తో ఆవు మృతి


