హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ ఢీకొని వ్యక్తి మృతి

MLG: వెంకటాపురం మండలం సూరవీడులో ద్విచక్రవాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన బంద వెంకటేశ్వర్లు (55) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ నెల 12న చికెన్ దుకాణం వద్ద నిలబడి ఉండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. మృతుడి కుమారుడి నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.