NRML: ముథోల్ నియోజకవర్గంలో 4,606 మంది అర్హులకు చేయూత పింఛన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. నేటి నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 5,251 దరఖాస్తులు రాగా, 360 తిరస్కరణకు గురయ్యాయని, మరో 255 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
ముథోల్లో 4,606 మందికి పింఛన్ల మంజూరు


