ADB: బోరజ్ మండలంలోని తరోడ గ్రామంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భజన సంకీర్తన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక పాటలకు అనుగుణంగా చిన్నారులు చేసిన నృత్యాలు, కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కనుమరుగవుతున్న ప్రాచీన కళలను నేటి తరానికి పరిచయం చేయాలని ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: తరోడలో కోలాటం ఆడుతూ ఆకట్టుకున్న చిన్నారులు


