హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత

HNK: భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు గజ్జల కొంరయ్య (95) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కొంరయ్య మృతిపట్ల స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర నాయకుడు బొజ్జపురి వెంకటయ్య సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.