హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థి మృతిపై ఎస్‌ఎఫ్‌ఐ ఆగ్రహం

RR: ఫరూఖ్‌నగర్ బీసీ హాస్టల్ విద్యార్థి ప్రణయ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్ అన్నారు. హాస్టల్‌లో వాచ్‌మెన్ లేకపోవడం, వార్డెన్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు రాత్రివేళ బయటకు వెళ్తున్నారని మండిపడ్డారు. వార్డెన్‌ను సస్పెండ్ చేసి, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.