హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధికుక్కల దాడి.. బాలుడికి గాయాలు

WGL: సంగెం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం వీధికుక్కలు దాడి చేయడంతో రెండున్నరేళ్ల బాలుడు దెబ్బట ననిష్ గాయపడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో బాలుడికి గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కుక్కలను తరిమి బాలుడిని చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్య వివరాలు తెలియాల్సి ఉంది.