హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదర్ సమ్మేళనంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షులు

HYD: కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు పాల్గొన్నారు. ఉత్సాహంగా సాగిన వేడుకల్లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. యాదవ సమాజానికి సదర్ ఉత్సవం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. యాదవుల గొప్ప సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, ఐక్యతకు ఈ ఉత్సవం ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.