KNR: వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో మూడో రోజు బొడ్రాయి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ కర్ర విజయ భగవాన్ రెడ్డి ఆహ్వానం మేరకు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ వేడుకలకు హాజరై రూ. 2,00,116 విరాళంగా అందజేశారు. గ్రామ ప్రజలంతా ఐక్యంగా బొడ్రాయి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని, ఇది గ్రామ ఐక్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
బొడ్రాయి వేడుకలకు రూ.2,00,116 విరాళం


