హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనుల కోసం మంత్రికి వినతి

BDK: గుండాల మండలం ముత్తాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ రాధా ఆదివారం మంత్రి సీతక్కను కలిసి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. ముత్తాపురం నుంచి పెద్దతోగు వరకు R&B రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని, గ్రామంలోని రహదారులకు సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.