SRCL: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన వరంగల్‌కు చెందిన భక్తుడు ఆటోలో మర్చిపోయిన విలువైన బ్యాగును పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఇనుస్ నిజాయతీగా తిరిగి అప్పగించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బ్యాగును భక్తుడికి అందజేశారు. తన వస్తువులను తిరిగి అందించిన ఆటో డ్రైవర్ నిజాయతీని భక్తుడు అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్ నిజాయతీ.. భక్తుడికి బ్యాగు అప్పగింత


