హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

VKB: బొంరాస్పేట మండల వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఆదివారం ఏర్పుమళ్ల గ్రామంలో ఇళ్ల ముందు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందారు. రాత్రివేళ బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అత్యవసర పనులను సైతం పగటిపూటే పూర్తి చేసుకుంటున్నారు.