హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి: కలెక్టర్

KMM: వెనుకబడిన వర్గాల పిల్లలు వారి సమస్యలు, ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చేలా సోమవారం కలెక్టరేట్‌లో ‘పిల్లల ప్రజావాణి' నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. పిల్లల భద్రత, రక్షణ, విద్య, ఆరోగ్యం, పోషణ, అభివృద్ధి, బాలల హక్కులకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని ఆయన తెలిపారు.