హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవల్లి ZPHS‌లో పాముల కలకలం

WNP: రేవల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పాముల సంచారం కలకలం రేపుతోంది. పాఠశాలలో పాములు కనిపిస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విద్యాశాఖ, గ్రామపంచాయతీ అధికారులు స్పందించి పరిసరాలను శుభ్రం చేసి పాముల బెడద నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.