హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

KMR: బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో నేడు మధ్యాహ్నం 2:00 గంటలకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నట్లు మండల పరిషత్ అధికారి మెహబూబ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.