హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

SRD: మండల కేంద్రమైన కంగ్టి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై దుర్గారెడ్డి సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 5 మంది వ్యక్తులను పట్టుకుని వారి నుంచి రూ.10.600 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా పేకాట ఆడినా, ఆడించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.