అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) బృందం రేపు ఢిల్లీకి రానుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా డీజీసీఏ నియంత్రణ చట్టాలు, శిక్షణ పొందిన సిబ్బంది, సంస్థాగత సామర్థ్యాలను పరిశీలించనుంది. దాదాపు 200లకుపైగా ప్రశ్నలతో ఈ తనిఖీ జరగనుంది. IASAలో 'కేటగిరి-1' హోదాను నిలబెట్టుకునేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
వార్తలు
రేపు ఢిల్లీకి అమెరికా FAA బృందం


