హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి సెటైర్లు

భారత్ సమ్మిట్‌లో ఇటలీ నేత ఫిలిబెక్ 'Vote Chor, Gaddhi Chhod' అనగా రాహుల్ గాంధీ నవ్వడంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పరోక్షంగా సెటైర్లు వేశారు. దేశాన్ని విదేశీయుడు అవమానిస్తే నవ్వడం ఎప్పుడైనా చూశారా అంటూ ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రాహుల్ విదేశాలకు వెళ్లి భారత్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ బీజేపీ నేతలు గతంలోనూ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.