హైదరాబాద్: 28°C
వార్తలు

స్లీపర్ టికెట్ రద్దుకు రూల్స్ ఇవే!

వందే భారత్ స్లీపర్ రైళ్లలో తత్కాల్, RAC, వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉండవు. కన్ఫర్మ్ టికెట్లు ఉన్నవారే ప్రయాణించాలి. టికెట్ రద్దు చేస్తే 72 గంటల ముందు 25%, 72–8 గంటల మధ్య 50% రీఫండ్ లభిస్తుంది. 8 గంటల లోపు రద్దు చేస్తే రీఫండ్ ఉండదు. ప్రస్తుతం హౌరా-కామాఖ్య, వారణాసి-ఢిల్లీ, బెంగళూరు-ముంబై మార్గాల్లో నడుస్తున్న ఈ రైళ్లు గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణించేలా తయారు చేశారు.