RR: బాలాపూర్ క్రాస్‌రోడ్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టిప్పర్ స్కూటర్‌ను ఢీకొట్టడంతో చిత్తమ్మ (55) ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. చర్చిలో ప్రార్థనలు ముగించుకుని మల్లాపూర్‌లోని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
తెలంగాణ
టిప్పర్ ఢీకొని మహిళ దుర్మరణం


