RR: మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన NS ఇండస్ట్రీస్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. యువ పారిశ్రామికవేత్తలు విశాల్, సాగర్ ఈ పరిశ్రమను స్థాపించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. సొంతంగా పరిశ్రమలు స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
యువత ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి: భట్టి


