హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లోకి BRS నాయకులు

హనుమకొండ భవానీనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన సుమారు 29 మంది కాంగ్రెస్‌లో చేరారు. మాజీ బీఆర్ఎస్ వార్డు సభ్యులు చెన్న వెంకటేశ్వర్లు, సముద్రాల రాజు తదితరులున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన గుర్తింపు దక్కుతోందని ఎమ్మెల్యే అన్నారు.