హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS పాలనపై కాంగ్రెస్ నేతల విమర్శలు

BHPL: గత BRS పాలనలో ఇసుక అక్రమ రవాణా వల్ల రహదారులు ధ్వంసమయ్యాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మహదేవ్‌పూర్ మండలం పలు గ్రామంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. కుంట్లం నుంచి మద్దులపల్లి వరకు రహదారి నిర్మాణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ.22 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి గడువులోగా పూర్తి చేస్తామన్నారు.