ASF: సమాజంలో గోవుల సంరక్షణ, పెంపకం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆసిఫాబాద్ సివిల్ కోర్టు సీనియర్ న్యాయమూర్తి అనంతలక్ష్మి అన్నారు. ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలోని గోశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గోశాలలో ఆవుల పెంపకం, పశుగ్రాసం, పాల ఉత్పత్తులపై గోశాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్యనారాయణ స్వామి, దుర్గాదేవి ఆలయాలను సందర్శించారు.
తెలంగాణ
'గోవుల సంరక్షణ, పెంపకం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది'


