హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కలెక్టరేట్‌లో బాలల ప్రజావాణి

NZB: బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా రేపు (16న) కలెక్టరేట్‌లో ప్రత్యేక బాలల ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం తెలిపారు. సాధారణ ప్రజావాణితో పాటు బాలల ప్రజావాణి కొనసాగుతుందని, విద్య, వైద్యం, రవాణా, సంక్షేమ సమస్యలపై బాలబాలికలు అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.