SRPT: అనంతగిరి మండలం వాయిలసింగారంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి గ్రామపంచాయతీ చర్యలు చేపట్టింది. డిసెంబర్ 10లోగా బెల్ట్ షాపులు తొలగించాలని నిర్వాహకులకు గడువు విధించినట్లు సర్పంచ్ నందిగామ శ్రీనివాస్ తెలిపారు. గడువులోగా తొలగించకపోతే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. మద్యపాన నిషేధ కమిటీ ఏర్పాటు చేసి, మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
వాయిలసింగారంలో మద్యపాన నిషేధానికి చర్యలు


