VKB: కొడంగల్ మండలంలోని ఇందనూర్, ధర్మాపూర్, రాయిచూర్ తదితర గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులతో కంది పంట ఎండిపోతోంది. పంట చేతికొచ్చే సమయంలో వాడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు నీరుగారిపోతున్నాయని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
వర్షాభావంతో ఎండుతున్న కంది పంట


