హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిగురాల్పల్లి గేటు వద్ద నీటి లీకేజీ

VKB: పరిగి మండలం చిగురాల్పల్లి గేటు సమీపంలో మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. గత మూడు రోజులుగా రోడ్డుపక్కన ఉన్న వాల్ నుంచి నీరు నిరంతరంగా బయటకు ప్రవహిస్తోంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టాలని, మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.