HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ప్లాట్ఫామ్ నంబర్ 4, 5 మధ్య సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి ఒంటిపై బ్లూ టీషర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యం లేదా ఇతర కారణాలతో మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్లో వృద్ధుడి మృతి


