హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్‌లో బీఆర్ఎస్‌కు కొత్త చేరికలు

RR: ఉప్పల్ నియోజకవర్గం కళ్యాణపురికి చెందిన ప్రదీప్‌రావు, ఆయన సతీమణి డి. రజినీరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పసుల ప్రభాకర్‌రెడ్డి, గంధం నాగేశ్వర్‌రావు, సంపత్‌రావు, కుమారస్వామితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.