హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాల జిల్లాలో 13,913 మందికి కొత్త పింఛన్లు

జగిత్యాల జిల్లాలో 13,913 మందికి నూతన చేయూత సామాజిక భద్రతా పింఛన్లు మంజూరయ్యాయి. ఆదివారం కలెక్టరేట్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. జిల్లాలో మొత్తం 18,955 దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 13,913 మందిని అర్హులుగా గుర్తించినట్లు మంత్రి తెలిపారు.