హైదరాబాద్: 28°C
తెలంగాణ

కీసర అయ్యప్ప ఆలయానికి విరాళం

MDCL: కీసరలోని శ్రీ వరాల అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదాన సేవకు భక్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా గుర్రం శ్రావంతి శ్రీధర్ రెడ్డి నిత్య అన్నప్రసాద కార్యక్రమం నిర్వహణకు రూ.10 వేల విరాళం సమర్పించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ నల్ల బాల్ రెడ్డి గురుస్వామి, ఇతర గురుస్వాములు, కమిటీ సభ్యులు విరాళాన్ని స్వీకరించి దాతను అభినందించారు.