హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

NRML: సారంగాపూర్ మండలం మలక్ చించొలి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గోదాం భవన నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదాం అందుబాటులోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.