హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఏజెన్సీ ఉద్యోగాల్లో ఆదివాసీలకే ప్రాధాన్యం ఇవ్వాలి’

MLG: చిరుతల్లి ఆశ్రమ పాఠశాలలో ఆదివారం టీఎస్ ఏటీఎఫ్ ములుగు జిల్లా సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు, పదోన్నతులు స్థానిక ఆదివాసీలతో భర్తీ చేసేలా ప్రత్యామ్నాయ జీఓ, చట్టం తేవాలని రాష్ట్ర నాయకులు కోరారు. జిల్లా అధ్యక్షుడిగా కొట్టెం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా బొగ్గుల లక్ష్మయ్య ఎన్నికయ్యారు. మండల కమిటీలను ఎన్నుకున్నారు.