హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆసిఫాబాద్‌లో బిర్సా ముండా విగ్రహాన్ని ప్రతిష్టించాలి'

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భగవాన్ బిర్సా ముండా విగ్రహాన్ని ప్రతిష్టించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జనజాతీయ గౌరవ దివస్‌లో మాట్లాడుతూ.. జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలనూ కూడా పరిష్కరించాలని కోరారు. 5వ షెడ్యూల్ చట్టాలను పటిష్టంగా అమలు చేసి ఆదివాసీలకు ఏజెన్సీ DSC ప్రకటించాలన్నారు.